Cricket : కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం!

Cricket : కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం!
X

IPLలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు సారథ్య బాధ్యతలు అప్పగించొద్దని టీం ఓనర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ కావడం లాంఛనమే. ఇన్నాళ్లు రాహుల్, అక్షర్‌లలో ఎవరు కెప్టెన్ అవుతారనే ప్రశ్నలకు తాజా నిర్ణయంతో ఆన్సర్ దొరికినట్లయింది. కేఎల్‌ రాహుల్‌ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌కు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో పంజాబ్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్‌ కెప్టెన్‌గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి అసైన్‌మెంట్‌ అవుతుంది. అక్షర్‌కు దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గుజరాత్‌ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది.

Tags

Next Story