Cricket : రాహుల్‌కు లక్నో టాటా!

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్‌లోనూ కలిసి వచ్చేలా లేదు. ఇప్పటికే భారత టీ20 జట్టుకు దూరమై, ఇటీవలే న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో చోటు కోల్పోయిన అతను.. ఐపీఎల్‌లో గత మూడేళ్లుగా కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ఫ్రాంఛైజీకి కూడా దూరం కాబోతున్నాడు. వచ్చే సీజన్ కోసం మెగా వేలం జరగనున్న నేపథ్యంలో లఖ్‌నవూ అట్టిపెట్టుకోనున్న ఆటగాళ్లలో రాహుల్ ఉండబోడట. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని లఖ్‌నవూ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి సూపర్ ఫాస్ట్‌బౌలర్‌గా పేరు తెచ్చుకున్న మయాంక్ యాదవ్, యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను లఖ్‌నవూ కచ్చితంగా అట్టిపెట్టుకోనుందట. పేసర్ మోసిన్ ఖాన్, మిడిలార్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని కూడా జట్టుతో కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ పూర్తవగానే రాహుల్.. లఖ్‌నవూతో బంధం తెంచుకోనున్నట్లు వార్తలొచ్చాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తుగా ఓడడంతో లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగా తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ కినుక వహించాడని, దీంతో ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని భావిస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com