Kohli : కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: కోహ్లీ

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక(5) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఛేజ్ మాస్టర్ 2012 T20 వరల్డ్ కప్ , 2015 ODI వరల్డ్ కప్, 2016 T20వరల్డ్ కప్, 2022 T20వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదిపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పొందారు. మరే ఇతర ప్లేయర్ ప్రత్యర్థి జట్టుపై 3 కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com