KOHLI: కోహ్లీ రిటైర్మెంట్‌పై పలువురు రియాక్షన్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై అతని భార్య అనుష్క శర్మ పోస్ట్ పెట్టారు. 'అభిమానులు కోహ్లీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ వాటి వెనక ఉన్న కన్నీళ్లను, ఎవరూ చూడని పోరాటాలను ఈ ఫార్మాట్‌లో నువ్వు ఇచ్చిన అచంచలమైన ప్రేమ గుర్తుండిపోతాయి. వైట్‌జెర్సీలో ఆడినప్పుడే రిటైర్ అవుతావని అనుకున్నా కానీ నీ మనసు మాట విన్నావు. నువ్వు ఎంతో గొప్పపేరును సంపాదించావు' అన్నారు.
రిటైర్ అవ్వాలనుకోలేదు: రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్ అవ్వాలని తాను అనుకోలేదన్నాడు. ఏదీ ముందుగా నిర్ణయించలేమన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024ను సొంతం చేసుకోగానే ఇంకొన్నాళ్లు ఆడాలని అనుకున్నానని, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే టీమ్ నుంచి బయటకు వెళ్లడానికి ఇదే సరైన సమయం అనిపించిందన్నాడు.
థాంక్యూ విరాట్: బీసీసీఐ
భారత టెస్టు క్రికెట్‌కు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై బీసీసీఐ స్పందించింది. 'థాంక్యూ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. కానీ, వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుంది. టీమిండియా మాజీ కెప్టెన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. టీమిండియాకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.' అంటూ బీసీసీఐ 'ఎక్స్' లో పేర్కొంది.
విరాట్ ఆకలితో ఆడాడు: యువీ
కోహ్లీ రిటైర్మెంట్‌పై మాజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. 'టెస్ట్ క్రికెట్.. కింగ్ కోహ్లీలోని ఫైటర్‌ని బయటకు తీసుకొచ్చింది. అతడు ఒక ఫైటర్‌లాగానే పోరాడాడు. అద్భుతమైన ఆట ఆడాడు.. ఆ ఆటలో ఆకలితో పాటు ప్యాషన్ కనిపించింది. కోహ్లీలోని ఫైర్ ప్రతి యంగ్ క్రికెటర్‌కు ఆదర్శం. కోహ్లీని చూస్తే గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు.
మాజీల షాక్
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆయన అభిమానులతోపాటు మాజీ ప్లేయర్లు కూడా షాకవుతున్నారు. కోహ్లీని ఎందుకు ఇలా చేశావ్ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా కోహ్లీని ఏంటి ఈ నిర్ణయం అనేట్టుగా క్వశ్చన్ చేశారు. విరాట్ కోహ్లీ వీడ్కోలుతో క్రికెట్ ప్రపంచం ఓ దిగ్గజ ఆటగాడి సేవలు కోల్పోయిందని పలువురు మాజీలు ట్వీట్ చేశారు.
"విరాట్.. మోసం చేశావ్"
టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ వెనక్కి తగ్గలేదు. టెస్టులకు వీడ్కోలు పలుకుతూ సంచలన ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రన్ మెషిన్ గుడ్ బై చెప్పాడు. విరాట్ వీడ్కోలుకు ఇది సమయం, సందర్భం కాదని మాజీలు విజ్ఞప్తి చేసినా కోహ్లీ వెనకడుగు వేయలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. "కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి మమ్మల్ని మోసం చేశావ్" అంటూ పోస్టులు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com