హత్య కేసును చేదించిన కోహ్లీ ఫోటో

హత్య కేసును చేదించిన కోహ్లీ ఫోటో
ఆటోరిక్షా వెనకాల ఉన్న‘కింగ్ కోహ్లి’ అనే పదాలు దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను కనుగొనడం లో సహాయపడింది.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ హత్య కేసులో నిందితులను పట్టుకోవడం లో సహాయపడ్డాడు. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లో నివసిస్తున్న కమలమ్మ (82) ను దుండగులు హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి టేపుతో శవమై కనిపించింది. మే 27న హత్య జరిగిపట్లు పోలీసులు తెలిపారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లంబర్ పనులు చేసే అశోక్ అనే వ్యక్తి తన సహచరులైన అంజనమూర్తి, సిద్దరాజు కలిసి కమలమ్మను హత్య చేశారు.

ముందుగా.. అశోక్ ప్లంబింగ్ పనుల నిమిత్తం కమలమ్మ ఇంటికి వచ్చాడు. కమలమ్మ తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నట్లు గమనించాడు. దీంతో ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడవుగా... తన సహచరులైన అంజనమూర్తి, సిద్దరాజుతో కలిసి మే 27న దొంగతనం చేయడానికి వెళ్లారు. ముందుగా ఇంటిని బిస్కెట్ల గోడౌన్ కోసం రెంట్ కు ఇవ్వాలని అడిగారు.

ఈ క్రమంలోనే మాటల మధ్య వారు ఇచ్చిన బిస్కెట్లను కమలమ్మ తింటుండగా ఆమెపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో దుర్వాసన వస్తుండటంలో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.

అదే రోడ్డులో ఆటోరిక్షా అనేక సార్లు తిరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆటోరిక్షా వెనకాల ఉన్న ‘కింగ్ కోహ్లి’ అనే పదాలు తొలగించడం గమనించారు, ఆటోకు రిజిస్ట్రేషన్ నంబర్ లేదని కనుగొన్నారు. ఆటోరిక్షా వెనకాల ఉన్న‘కింగ్ కోహ్లి’ అనే పదాలు దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను కనుగొనడం లో సహాయపడింది. నిందితులను మైసూరులో ఉండగా పోలసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఎంతైనా కింగ్ కోహ్లీ ఓ హత్య కేసును చేధించారు.

Tags

Read MoreRead Less
Next Story