IPL 2025 : అంపైర్ గా కోహ్లి సహచరుడు

IPL 2025 : అంపైర్ గా కోహ్లి సహచరుడు
X

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సుదీర్ఘ కెరీర్లో చాలా మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ వంటి ప్రముఖ లీగ్ల లో కోహ్లి ఆడాడు. తాజాగా కోహ్లితో కలిసి ఆడిన ఓ సహచర క్రికెటర్ ఇప్పుడు అంపైర్గా అవతారం ఎత్తాడు. కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. యూపీకి చెందిన 35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ 2008లో కోహ్లి సారథ్యంలో ప్రపంచకప్ గెలిచి భారత అండర్-19 జట్టులో కీలక సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక ఫైనల్లో శ్రీవాత్సవ అద్భుతమైన బ్యాటింగ్ తో విజయం లో కీలక పాత్ర పోషించాడు.

Tags

Next Story