IND VS ENG : మూడో టెస్టుకు కేఎస్ భరత్ ఔట్.. వికెట్ కీపర్‌గా ధ్రువ్!

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. అయితే మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురేల్ అరంగ్రేటం చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎస్ భరత్‌కు జట్టు యాజమాన్యం వరుసగా అవకాశాలు ఇస్తోంది.
కీపింగ్ లో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. గత ఏడు టెస్టు మ్యాచులు ఆడిన భరత్.. 20 సగటుతో 221 రన్స్ మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లోనూ నాలుగు సార్లు బ్యాటింగ్ చేసి 92 రన్స్ స్కోర్ చేశాడు. దీనికి తోడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 23 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. దీంతో మూడో టెస్టు జట్టులో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇక ధృవ్ జురెల్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. ఇప్పటి వరకు ఆడిన 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 46.47 సగటుతో 790 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు. భరత్ కంటే జురెల్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇండియా, ఇంగ్లండ్ చేరో మ్యాచ్ లో గెలిచి సమంగా ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com