Lakshya Sen : దూకుడుగా ఆడటంలో కోహ్లీనే ఇనిస్పిరేషన్ : లక్ష్యసేన్

Lakshya Sen : దూకుడుగా ఆడటంలో కోహ్లీనే ఇనిస్పిరేషన్ : లక్ష్యసేన్
X

పారిస్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ టైమ్ సెమీస్ కు చేరిన భారత మెన్ షట్లర్‌గా లక్ష్యసేన్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకూ పోరాడి కాంస్య పతక మ్యాచ్‌లో కొద్ది తేడాతో ఓడిపోయాడు. అయితే, వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం సాధిస్తానని చెబుతున్న లక్ష్యసేన్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఎంత కీలకంగా మారాడో.. తాను కూడా బ్యాడ్మింటన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తం చేయడంలో విరాట్ కోహ్లీ కూడా కీలక పాత్ర పోషించాడు. అందుకే, రాబోయే రోజుల్లో నేను కూడా బ్యాడ్మింటన్‌లో విరాట్‌లా కావాలనేదే నా కోరిక. అతడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగుతా. కష్ట సమయాల్లోనూ దూకుడుగా ఉండటం ఎలా అనేది కోహ్లీని చూస్తే సరిపోతుంది. విజయం కోసం చివరివరకూ పోరాడటం విరాట్ నుంచే నేర్చుకుంటా’అని లక్ష్య వెల్లడించాడు

Tags

Next Story