Manu Bhaker : ఫ్యాషన్ షోలో మెరిసిన మను భాకర్

Manu Bhaker : ఫ్యాషన్ షోలో మెరిసిన మను భాకర్
X

పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ లో మూడు మెడల్స్ సాధించిన భారత షూటర్ మను భాకర్ ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన షూటింగ్ ను పక్కన పెట్టి.. ఓ ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మెరిసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల 11న జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. దేశ రాజధాని ఢిల్లీలో అందాల భామలతో పోటీ పడింది. ప్రొఫెషనల్స్‌ తోపోటిపడిన ఆమో ఆందమైన డ్రెస్సులో అదరగొట్టింది. ర్యాంప్ వాక్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. షూటింగ్ ప్రాక్టీస్ తర్వాత దొరికిన కొద్ది సమయంలో ఇలాంటి షో లో పాల్గొనడం ఉత్సహంగా ఉన్నప్పటికి.. అందరి ముందు ర్యాంప్ వాక్ లో నడవడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే మను భాకర్ లాక్మే ఫ్యాషన్ వీక్ లోని ర్యాంప్ వాక్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Tags

Next Story