Manu Bhaker : మను భాకర్ కు విశ్రాంతి.. ఢిల్లీలో షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్

భారత స్టార్ షూటర్ మను బాకర్ వచ్చే నెలలో జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్‌లో పాల్గొనడం లేదు.పారిస్ ఒలింపిక్స్ రెండు కాంస్య పతకాలు సాధించి చిరిత్ర సృస్టించిన మను.. మూడు నెలలు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.దీంతో
వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. ఈ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అక్టోబర్ 13 నుంచి 18 వరకు జరగనుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్ఏఐ) గురువారం వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత బృందాన్ని ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో 23 మంది భారత షూటర్లు బరిలోకి దిగబోతున్నారు. దివ్యాన్ష్ సింగ్(పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సోనమ్ ఉత్తమ్ మస్కర్(మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రిథమ్ సంగ్వాన్(మహిలల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్), గణేమత్ సెఖోన్(మహిళల స్కీట్) నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు. మిగతా వారు ర్యాంకింగ్స్, ఒలింపిక్ ట్రయల్స్ ద్వారా ఎంపికయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న బృందంలోని 9 మంది షూటర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com