MATT FORD: వరల్డ్ రికార్డ్.. వన్డేలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

ప్రపంచ వన్డే క్రికెట్‌లో సంచలన రికార్డ్ నమోదైంది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. అత్యంత వేగమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరు మీదున్న ఈ రికార్డ్ సమమైంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాథ్యూ ఫోర్డ్ ఈ రికార్డ్‌ను సమం చేశాడు. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ అయితే 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని ఔరా అనిపించాడు. అయితే ఇది టీ20ల్లో. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ సౌతాఫ్రికా గ్రేట్ ఏబీ డిలియర్స్ పేరు మీద ఉంది. ఇప్పుడో కరీబియన్ కుర్ర బ్యాటర్ ఈ క్రేజీ రికార్డును సమం చేశాడు.
వెస్టిండీస్ పించ్‌హిట్టర్ మాథ్యూ ఫోర్డ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టేశాడు. ఐర్లాండ్‌తో పోరులో 16 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు మాథ్యూ ఫోర్డ్. మొత్తంగా 19 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 2 బౌండరీలతో పాటు ఏకంగా 8 భారీ సిక్సులు ఉన్నాయి. 305 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మాథ్యూ ఫోర్డ్.. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు.
సిక్సుల మీద సిక్సులు
సిక్సుల మీద సిక్సులు బాదుతూ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా (16 బంతుల్లో) డివిలియర్స్‌తో కలసి తొలి స్థానంలో నిలిచాడు ఫోర్డ్. కాగా, 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో విండీస్‌తో జరిగిన పోరులో 44 బంతుల్లో 149 పరుగుల నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు ఏబీడీ. ఈ క్రమంలో 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డును ఫోర్డ్ ఇవాళ సమం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com