Maxwell : మాక్స్‌వెల్ సెంచరీ.. రోహిత్ రికార్డు సమం

ఆస్ట్రేలియా విధ్వంసర ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (Maxwell) లేటు వయసులోనూ రెచ్చిపోతున్నాడు. 35 ఏళ్ల మాక్స్‌వెల్ అడిలైడ్‌లో 2024 ఫిబ్రవరి 24న వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్స్‌లు,12 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో టీ20 ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ(5) (Rohit sharma) రికార్డును సమం చేశాడు.
రోహిత్ శర్మ 151 మ్యాచ్‍ల్లో 31.79 సగటు, 139.97 స్ట్రైక్ రేట్‌తో 5 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేస్తే, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 102 మ్యాచుల్లో 30.83 సగటు, 155.26 స్ట్రైక్ రేట్‌తో 2405 పరుగులు చేశాడు. ఇందులోల ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అతడు 57 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేసి రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 207 రన్స్ చేసింది. పరుగుల వరద పారిన ఈ పోరులో ఆసీస్ 34 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ను దక్కించుకుంది.
టీ20 క్రికెట్ అత్యధిక సెంచరీ వీరులు
1. రోహిత్ శర్మ- 5 (143 మ్యాచ్ లు)
1. గ్లెన్ మ్యాక్స్ వెల్- 5 (94 మ్యాచ్ లు)
2. సూర్యకుమార్ యాదవ్- 4 (57 మ్యాచ్ లు)
3. బాబర్ అజామ్- 3 (103 మ్యాచ్ లు)
4. కొలిన్ మన్రో-3 (62 మ్యాచ్ లు)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com