Lionel Messi : మెస్సీ ఒక్క కాలు విలువ రూ. 7400 కోట్లు.. ఈ కాలుతో ఒక దేశాన్నే కొనేయొచ్చు

Lionel Messi : మెస్సీ ఒక్క కాలు విలువ రూ. 7400 కోట్లు.. ఈ కాలుతో ఒక దేశాన్నే కొనేయొచ్చు
X

Lionel Messi : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించడం ఒక మెరుపులాంటి అనుభూతిని మిగిల్చింది. కోల్‌కతా, హైదరాబాద్ మీదుగా ఢిల్లీ చేరుకున్న మెస్సీకి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన సన్మాన వేడుకలో క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానుల కలయిక అద్భుతంగా అనిపించింది. టీమ్ ఇండియా జెర్సీని మెస్సీకి బహుకరించడం, బీసీసీఐ కార్యదర్శి జై షా 2024 టీ20 వరల్డ్ కప్ విన్నర్స్ సంతకం చేసిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ఈ అరుదైన దృశ్యం స్పోర్ట్స్ హిస్టరీలోనే ఒక స్పెషల్ మూమెంట్‌గా నిలిచిపోయింది.

మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే కానీ, అతని ఎడమ కాలికి ఉన్న ఇన్సూరెన్స్ వాల్యూ తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే. రిపోర్ట్స్ ప్రకారం.. మెస్సీ తన ఎడమ కాలికి ఏకంగా 900 మిలియన్ డాలర్ల బీమా చేయించుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 7400 కోట్ల రూపాయలకు సమానం. పలావు, తువాలు, నౌరు వంటి చిన్న చిన్న దేశాల మొత్తం వార్షిక ఆదాయం కంటే మెస్సీ కాలి ఇన్సూరెన్స్ వెలనే ఎక్కువంటే అర్థం చేసుకోవచ్చు ఆ కాలుకు ఉన్న విలువ ఏంటో! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా బీమా పాలసీలలో ఇది ఒకటి.

మెస్సీ భారత్‌కు వచ్చినా కనీసం ఒక చిన్న ప్రదర్శన మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేదని చాలామంది అభిమానులు నిరాశ చెందారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఆ భారీ ఇన్సూరెన్స్ పాలసీనే. సాధారణంగా ఇలాంటి పెద్ద ఆటగాళ్లు అధికారిక మ్యాచ్‌లు కాకుండా, ఇలాంటి అనధికారిక లేదా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఆడితే ఒకవేళ గాయపడితే ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లించవు. కెరీర్‌కే రిస్క్ వచ్చే ప్రమాదం ఉండటంతో, మెస్సీ లాంటి స్టార్స్ కేవలం అతిథులుగా హాజరవుతారే తప్ప, బంతిని తన్నే సాహసం చేయరు. అందుకే ఆయన ఆటను చూడలేకపోయినా, ఆయన ఉనికి భారత్ కు గర్వకారణంగా నిలిచింది.

Tags

Next Story