Virat Kohli : నాకు చాన్స్ వస్తే.. కోహ్లీని అమ్మేస్తా

Virat Kohli : నాకు చాన్స్ వస్తే.. కోహ్లీని అమ్మేస్తా
X

టీమిండియా గొప్ప ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు ముందువరసలో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు సారథులు దేశంకు ఎన్నో ట్రోఫీలు, టైటిల్స్‌ అందించారు. భారత్ జట్టు తరఫున ఓకే జట్టులో ఆడిన వీరు.. ఐపీఎల్‌లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే వీరు ఐపీఎల్‌లో ఒకే జట్టులో ఉన్నప్పుడు.. ముగ్గురిలో ఒక్కరినే ఆడించాల్సి వస్తే..ఎవరిని ఎన్నుకుంటారు?.. ఎవరిని వదులుకుంటారనే క్లిష్ట ప్రశ్నకు స్పందిస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Michael Vaughan కీలక కామెంట్స్ చేశారు. ‘ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల్లో ఒక్కరినే ఆడించాల్సిన పరిస్థితే వస్తే.. నేను మహీని ఎంచుకుంటా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెప్టెన్‌గా ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్‌ అందించాడు. వేరే ఎవ్వరూ జట్టుని అంత గొప్పగా నడిపించలేరు. రోహిత్‌, కోహ్లీల్లో ఒకరిని వదులుకోవాల్సి వస్తే.. కోహ్లీని మరో ఫ్రాంచైజీకి అమ్మేస్తా. ఎందుకంటే విరాట్ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేదు. రోహిత్‌ ఆరు సార్లు ముంబైకి కప్‌ను అందించాడు. రోహిత్‌ని ధోనీకి సబ్‌స్టిట్యూట్‌గా పెట్టుకుంటా’ అని మైఖేల్‌ వాన్‌ తెలిపాడు.‘ఐపీఎల్‌ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ 2008 నుంచి ఇప్పటివరకూ ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీ మాత్రమే. కప్ లేకున్నా.. విరాట్ ఖాతాలో చాలా రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 251 మ్యాచ్‌లు ఆడి 8 వేలకు పైగా రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. అతడిని వేరే ఫ్రాంచైజీకి అమ్మితే కోట్లు వస్తాయి. నాకు మంచి వ్యాపారం కూడా అవుతుంది’ అని మైఖేల్‌ వాన్‌ చెప్పుకొచ్చాడు. మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం జరగనుంది. రోహిత్ వేలంకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విరాట్ బెంగళూరుకే ఆడనున్నాడు. ఇక ధోనీ ఆడుతాడో లేదో చూడాలి.

Tags

Next Story