క్రీడలు

Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు..!

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ కు స్వర్ణం లభించింది.

Tokyo Olympics 2021: టోక్యో  ఒలంపిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు..!
X

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ కు స్వర్ణం లభించింది. 73 కిలోల విభాగంలో ప్రియామాలిక్ విజయం సాధించారు. రోయింగ్‌లో భారత్‌కు శుభారంభం కనిపించింది. లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ రెపికేజ్ సెమీ ఫైనల్ కు రోవర్స్ అర్జున్, అర్వింద్ సింగ్ జోడి అర్హత సాధించింది.

బ్యాడ్మింటన్ లో గ్రూప్ జే తొలి మ్యాచ్‌లో పీవీసింధు విజయంసాధించింది. మహిళల సింగ్స్‌లో తమ సత్తాచాటింది. ఇజ్రాయెల్ షట్లర్ సెనియాపై పీవీసింధు ఆధిక్యత కనబరిచింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మనిక బత్రా విజయంసాధించింది. మార్గిరిటా పెసోట్ స్కాపై 4-3 తేడాతో గెలుపు కైవసం చేసుకుంది.

టేబుల్ డెన్నిస్‌లో మహిళల సింగిల్స్‌ లో భారత్‌కు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో జ్ఞానశేఖర్ సత్యన పరాజయం పొదారు. లామ్ సియా హంగ్ చేతిలో 3-4 తేడాతో సత్యన్ ఓటమిపాలయ్యారు. ఇక మహిళల టెన్నిస్‌లో సానియా జోడి ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ తొలిరౌండ్‌లో సానియా-అంకిత జోడి ఓడిపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన జోడి చేతిలో సానియా జోడి పరాజయం పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌నుంచి ఆండి ముర్రేవై దొలగారు. కండరాల నొప్పితో తప్పుకున్నారు. అయితే పురుషుల డబుల్స్ లో మాత్రం కొనసాగుతారు.

మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. మనుబాకర్, యశస్వినిలు ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయారు. వీరిద్దరు 12 వ స్థానంలో నిలిచారు. దీంతో వీరు ఫైనల్‌లో పాల్గొనె అవకాశం కోల్పొయారు.

Next Story

RELATED STORIES