Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలి : మహ్మద్ కైఫ్

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా మాత్రమే ఆడాలని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సూచించాడు. 2025 సీజన్‌లో రోహిత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేలా ఆర్సీబీ అతడిని ఒప్పించి కెప్టెన్‌గా నియమించాలని కోరాడు. రోహిత్ శర్మ 2011 నుంచి ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. 2013 సీజన్‌లో మధ్యలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్ ప్రారంభానికి ముందు ముంబయి ఇండియన్స్ రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించింది. అయితే, 2025 సీజన్‌కు ముందు వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వేలంలో రోహిత్ శర్మను దక్కించుకుని కెప్టెన్‌గా చేయాలని కైఫ్ సూచించాడు. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌లో కొనసాగతాడా? లేక వేలంలో పాల్గొని వేరే ఫ్రాంఛైజీ తరఫున ఆడతాడా? అనే దానిపై స్పష్టత లేదు. అక్టోబర్ 31 లోపు ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురిని అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కలిసి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com