Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే పథుమ్ నిస్సంక వికెట్ తీశారు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కారు. గతంలో దేబశిష్ మహంతి(1999), జహీర్ ఖాన్(2001, 2002, 2007, 09), ప్రవీణ్ కుమార్(2010) తొలి బంతికే వికెట్ తీశారు.
దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్‌పై (రిడ్లే జాకబ్స్)
జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్‌పై (మాథ్యూ సింక్లెయిర్)
జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)
జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)
జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)
ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)
మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (64) అక్షర్ పటేల్ (44) రాణించగా గిల్(35) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ (14), దూబే (0), కేఎల్ రాహుల్ (0), అయ్యర్ (7) తీవ్రంగా నిరాశపర్చారు. ఆ తర్వాత బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీసి లంకను గెలిపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com