Cricket : ముంబై ఫస్ట్ మ్యాచ్.. కెప్టెన్‌గా సూర్య

ముంబై ఈ సీజన్లో ఆడే తొలి మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. గత సీజన్లో చివరి మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై నిషేధం పడింది. దీంతో ఆ స్టార్ ఆల్‌రౌండర్ మార్చి 23న చెన్నైతో జరిగే తొలి మ్యాచుకు అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కి సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే నేరుగా వెల్లడించాడు. ఐపీఎల్ 2024 ఆఖరి మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. దాంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండటం లేదు. కాగా, ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com