Vinesh Phogat : నా పోరాటం ముగియలేదు.. ఇప్పుడే మొదలైంది: వినేశ్​ ఫొగాట్

Vinesh Phogat : నా పోరాటం ముగియలేదు.. ఇప్పుడే మొదలైంది: వినేశ్​ ఫొగాట్

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ ఫైనల్స్ కు ముందు అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్​ ఫొగాట్ మెడల్ ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ ఇంటర్నేషనల్ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అనర్హత వేటు వేసింది. కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌ (కాస్)లోనూ

చుక్కెదురైంది. తీవ్ర మనో వేదనతో పారిస్‌ నుంచి భారత్‌కు చేరుకున్న వినేశ్‌కు గ్రాండ్ వెల్ కమ్ దక్కింది. సోమవారం ఆమె బర్త్ డే సందర్భంగా వినేశ్​ స్వగ్రామమైన బలాలిలో వేడుకలు జరిగాయి. బలాలి గ్రామ పెద్దలు వినేశ్​ ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వినేశ్‌ ఫొగాట్‌ను గోల్డ్‌ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ మెడల్ కంటే ఏది గొప్పది కాదు

బలాలి పెద్దలు చేసిన సత్కార కార్యక్రమంలో వినేశ్ మాట్లాడుతూ.. ‘నా పోరాటం ముగియలేదు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైంది. పారిస్‌ ఒలింపిక్స్ ఫైనల్‌లో ఆడలేకపోయినప్పుడు చాలా బాధపడ్డా. నేనెంతో దురదృష్టవంతురాలిని అని భావించా. కానీ, స్వదేశంలో వచ్చిన మద్దతు చూశాక తాను ఎంతో అదృష్టవంతురాలినని అనిపించింది. నాకు ఇచ్చిన ఈ మెడల్‌ కంటే మరేదీ గొప్ప గౌరవం కాదు’అని వినేశ్‌ తెలిపింది.

Tags

Next Story