NEERAJ: నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర

NEERAJ: నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర
X
తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను అధిగమించిన గోల్డెన్ బాయ్

భారత స్టార్ జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్‌లో 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. ఖతార్‌ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్‌ లీగ్‌ మూడో రౌండ్‌లో ఈటెను 90.23 మీటర్లు విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్‌ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు . 2022లో స్టాక్ హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ ఈ ప్రదర్శన చేశాడు. దోహాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్‌ అందుకు తగినట్లు గానే మంచి ఆరంభం అందించాడు. మొదటి రౌండ్‌లో నే 88.84 మీటర్లు విసిరాడు. రెండో రౌండ్‌లోనూ బాగానే విసిరినా.. అది ఫౌల్‌ అయింది. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్‌ బెస్ట్‌ను అందించాడు. ఏకంగా 90+ మీటర్లు విసరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్‌ జులియన్‌ వెబర్ (91.06 మీటర్లు ) చివరి రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్‌ రెండో స్థా నంతో సరిపెట్టు కున్నాడు.

Tags

Next Story