Cricket WorldCup: బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న నెదర్లాండ్స్, శ్రీలంక

అక్టోబర్‌లో జరిగే ICC వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్ జట్టు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. గురువారం స్కాంట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్‌తో పాటు శ్రీలంకలు అర్హత సాధించాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్లు ఏవేవో తేలిపోయాయి. నెదర్లాండ్స్ జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనడం ఇది ఐదో సారి. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్ మూడు జట్లు వరల్డ్‌కప్ అర్హతకి పోటీలోనే ఉన్నాయి. వాటి మధ్య రన్‌రేట్ స్వల్పమే కారణం.
గురువారం స్కాంట్లాండ్‌తో తప్పక గెలవాల్సిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే ఛేదించింది. నెదర్లాండ్ ప్లేయర్ బాస్ డీ లీడ్ బ్యాటింగ్, బౌలింగుల్లో ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు, ఛేదనలో 123 పరుగులు చేశాడు. వన్డే చరిత్రలో ఓ మ్యాచ్‌లో 5 వికెట్లు, సెంచరీ చేసిన ఆటగాళ్లలో లీడ్ 4వ ఆటగాడు మాత్రమే.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఆటగాడు మెఖ్ ముల్లన్(106) సెంచరీ, కెప్టెన్ బేరింగ్టన్(64)లు అర్ధసెంచరీలతో రాణించారు. అయితే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించాలంటే నెదర్లాండ్స్ 278 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది.
20 ఓవర్ల వరకు నెదర్లాండ్ స్కోర్ 93/3 గా ఉండటంతో రన్‌రేట్‌పై కాకుండా విజయం సాధిస్తే చాలనుకున్నారు. 31వ ఓవర్ దాకా కూడా స్కాట్లాండ్‌కే విజయవకాశాలు ఉన్నాయి. దీంతో నెదర్లాండ్ సాధించాల్సిన రన్‌రేట్ కూడా పెరిగిపోతూ వచ్చింది. అయితే అర్హతకు కావాల్సిన సమీకరణం 24 బంతుల్లో 45 పరుగులు చేయాల్సినపుడు డి లీడ్ భారీ సిక్సర్లతో గేర్లు మార్చాడు. వరుస సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవతలి ఎండ్‌లోని జుల్ఫికర్(33 నాటౌట్, 32 బంతులు) కూడా విరుచుకుపడటంతో 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలిచి వరల్డ్‌కప్‌కి అర్హత సాధించారు. జింబాబ్వే, స్కాట్లాండ్ ఆశలను అడియాశలు చేశారు. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నారు. ఈ ఫలితంతో 1, 2 స్థానాల్లో నిలిచే జట్లేవో తేలనున్నాయి.
స్కోర్‌కార్డ్
స్కాట్లాండ్ 50 ఓవర్లు---> 277/9 (మెక్‌ములెన్ 106, బేరింగ్టన్ 64, లీడ్ 5/52)
నెదర్లాండ్స్ 42.5 ఓవర్లు---> 278/6 (డి లీడ్ 123 పరుగులు, 92 బంతులు, సకీబ్ 33 నాటౌట్, లీస్క్ 2/42)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com