TEAM INDIA: ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్?

ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌లో ఉన్నాడని, CTకి ముందు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకుంటే, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ దక్కుతుందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గిల్ ముంగిట అరుదైన రికార్డు
భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్... ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలకంగా మారతాడని అభిమానులు ఆశిస్తున్నారు. వన్డేల్లో మరో 85 పరుగులు చేస్తే అరుదైన ఘనతను గిల్ తన ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రస్తుతం 48 మ్యాచుల్లో 2,415 పరుగులతో ఉన్న గిల్.. అత్యంత వేగంగా 2,500 మార్క్‌ను అందుకొన్న క్రికెటర్‌గా మారే అవకాశం ఉంది. అలా చేయాలంటే ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో 85 పరుగులు రాబట్టాలి. అప్పుడు 50 మ్యాచుల్లోపే 2500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా 53 మ్యాచుల్లో ఈ మార్క్‌ను అందుకొన్నాడు.
న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
ఛాంపియన్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. పాకిస్థాన్ బ్యాటర్ కుష్‌దిల్ షా భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద ఉన్న రచిన్ బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి రచిన్ ముఖానికి బలంగా తగిలి, తీవ్ర రక్తస్రావమైంది. గాయం పెద్దదిగా కనిపిస్తుండటంతో CTలో రచిన్ ఆడటం డౌట్‌గా ఉంది.
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ శుభవార్త చెప్పారు. కోహ్లీ ఫిట్ నెస్‌తో ఉన్నాడని, ప్రాక్టీసు సెషన్‌కు కూడా వచ్చాడని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడని వెల్లడించారు. కోహ్లీ రెండో వన్డేలో బరిలో దిగాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com