Kiwis Player : సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్న కివీస్ స్టార్ ప్లేయర్స్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ తమ సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు టీ20 ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి లీగ్ మ్యాచులు లేనపుడు మాత్రం జాతీయ జట్టుకు ఆడనున్నారు. ఇప్పటికే కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్ కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఇలాంటి ఒప్పందాలే కలిగి ఉన్నారు. అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్‌లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com