గర్భవతి అయిన ప్రియురాలిని మోసం చేసిన ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్..

ఫుట్‌బాల్ క్రీడలో తన డ్రిబ్లింగ్ నైపుణ్యాలు, వేగంతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టిస్తూ, ఎన్నో గోల్స్ చేసి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న బ్రెజిల్‌కి చెందిన స్టార్ ఆటగాడు నెయ్‌మార్ అభిమానులు నివ్వెరపోయేలా చేశాడు.
PSG కి ప్రాతినిథ్యం వహించే ఈ ఏస్ ఆటగాడు, గర్భిణీ అయిన తన ప్రియురాలి క్షమాపణ కోరుతూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
ఈ ప్యారిస్ సెయింట్-జర్మైన్ ఫార్వర్డ్ ప్లేయర్ గర్భవతి అయిన స్నేహితురాలిని మోసం చేశాడన్న ఆరోపణల తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ప్రైవేట్ వ్యవహారం పబ్లిక్‌గా మారితే, క్షమాపణ కూడా పబ్లిక్‌గానే ఉండాలని తన తప్పుని ఒప్పుకున్నాడు.
అయితే నెయ్‌మార్, అతని భాగస్వామి బ్రూనా బియాన్‌కార్డి త్వరలోనే తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బ్రెజిలియన్ ఫార్వర్డ్ బ్లాగర్ అయిన ఫెర్నాండా కాంపోస్‌తో, ప్రియురాలిని మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌లో ఈ వ్యవహారాన్ని ధృవీకరించాడు. బియాన్‌కార్డి నుండి క్షమాపణలు కోరాడు.
“మీ ఇద్దరికీ, మీ కుటుంబం కోసం నేను దీన్ని చేస్తాను. అన్యాయాన్ని సమర్థించడం అనవసరం, కానీ మా జీవితంలో నాకు మీరు కావాలి. మీరు ఎంతవరకు ప్రభావితమయ్యారో, వీటన్నింటితో మీరు ఎంత బాధపడ్డారో, మీరు నా వైపు, నేను మీ వైపు ఎంతగా ఉండాలనుకుంటున్నారో నేను చూడగలను” అని అతను ప్రారంభించాడు.
నేను మిమ్మల్ని మోసం చేసాను. పిచ్‌లో, వెలుపలా నేను ప్రతిరోజూ విఫలమవుతాను. నేను నా వ్యక్తిగత సమస్యలను ఇంట్లో, నా స్నేహితులు, కుటుంబ సభ్యులతోనే పరిష్కరించుకుంటాను. ఇవన్నీ నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి, నేను నా పక్కన ఉండాలని కలలుగన్న స్త్రీ, నా బిడ్డకు తల్లిని ప్రభావితం చేశాయి. ఇప్పుడు నా కుటుంబంగా మారిన ఆమె కుటుంబాన్ని బాధించింది." అని రాసుకొచ్చాడు.
నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. మేము ముందుకు వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ జరుగుతుందని అనుకుంటున్నాను. మన బిడ్డ పట్ల మన ప్రేమ గెలుస్తుంది, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ మనల్ని బలపరుస్తుంది. ఐ లవ్ యూ” అని సందేశాన్ని ముగించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com