Virat Kohli : కోహ్లి ఫామ్‌పై టెన్షన్ వద్దు.. దినేష్ కార్తీక్ అభయం
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 0-2తో కోల్పోయింది. స్పిన్నర్లు ఆధిపత్యం కనబర్చిన ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ మాత్రమే రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ( Virat Kohli ) మూడు మ్యాచ్లో కలిపి 58 రన్స్ మాత్రమే చేశాడు.
శ్రీలంకతో సిరీస్లో రాణించకపోయినంత మాత్రాన కోహ్లి ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదని భారత మాజీ వికెట్కేపర్ దినేశ్ కార్తిక్ అభిప్రాయ పడ్డాడు. స్పిన్నర్లకు సహకరించే పిచ్లపై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. "ఈ సిరీస్ లో కఠినమైన పిచ్పీ స్పిన్న ర్లను ఎదుర్కొవడం కష్టం. ముందుగా దాన్ని అంగీకరిద్దాం. అది విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేదా మరెవరైనా కావొచ్చు. కాస్త పాతబడిన బంతితో 8 నుంచి 30 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైనపని. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పిచ్ లు ఈ విధంగా ఉండవు. కానీ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇది కఠినమైన పిచ్. నేను విరాట్ కోహ్లిని సమర్థించడం లేదు. కానీ స్పిన్ ఆడటం చాలా కష్టమని చెప్పగలను" అని దినేశ్ కార్తిక్ వివరించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com