Ravichandran Ashwin : రిటైర్మెంట్‌పై ఎలాంటి పశ్చాత్తాపం లేదు : రవిచంద్రన్ అశ్విన్

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. సిరీస్ మధ్యలో వీడ్కోలు పలుకడంతో అతని రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరిగింది. అయితే, తాజాగా అశ్వినే స్వయంగా తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనిపించిందని, అందుకే వీడ్కోలు పలికినట్టు వెల్లడించాడు.‘ఈ రోజు నాదైంది. రేపు కూడా నాదవుతుందని విశ్వసించను. సుదీర్ఘ కెరీర్‌లో ఆ ఆలోచన తీరే నా ఎదుగుదలకు కారణం. రిటైర్మెంట్ గురించి కొన్ని సార్లు ఆలోచించా. నిద్రలేచిన క్షణంలో నా సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనిపిస్తే ఆ రోజే ఆటను వదిలేయాలని అనుకున్నా. అనూహ్యంగా ఆ రోజు నాకు అనిపించింది. రిటైర్మెంట్‌పై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్రికెట్ తనకు చాలా ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. టెస్టు క్రికెట్ తనకు లైఫ్ టీచర్ అని చెప్పాడు’అని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com