Joe Root : రూట్‌కు మాత్రమే సచిన్ ను అధిగమించే సత్తా: వాన్
టెస్టు క్రికెట్లో సచిన్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (15,921) రికార్డును అధిగమించే సత్తా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కి మాత్రమే ఉందని మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 142 టెస్టులు ఆడిన రూట్ 11.940 పరుగులు సాధించాడు. తాజాగా విండీస్ పై రెండో టెస్టులో శతకం బాదాడు. దీంతో సచిన్ రికార్డును బ్రేక్ చేయగల సామర్థ్యం రూట్ కే ఉందని వాన్ తెలిపాడు.
విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్ కు ఈ రికార్డును అధిగమించడం సాధ్యంకాదని అన్నాడు వాన్. రూట్ ప్రస్తుతం అలిస్టర్ కుక్ (12,472) కంటే కాస్తంత వెనుకున్నాడు. భవిష్యత్ లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు. గతంలో మాదిరిగా నింపాదిగా కాకుండా, దూకుడుగా పరుగులు రాబడుతున్నాడు. నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాడు అంటూ మైకేల్ వాన్.. రూట్ కు కితాబిచ్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com