PANT: టీమిండియాకు బిగ్ షాక్... రిషబ్ పంత్ అవుట్..?

PANT: టీమిండియాకు బిగ్ షాక్... రిషబ్ పంత్ అవుట్..?
X
పంత్ స్థానంలో జగదీషన్ కు చోటు

ఇం­గ్లం­డ్ పర్య­ట­న­లో టీ­మిం­డి­యా స్టా­ర్ వి­కె­ట్ కీ­ప­ర్ బ్యా­ట­ర్ రి­ష­బ్ పం­త్‌­ను దు­ర­దృ­ష్టం వెం­టా­డిం­ది. మాం­చె­స్ట­ర్ వే­ది­క­గా ఇం­గ్లం­డ్‌­తో జరు­గు­తు­న్న నా­లు­గో టె­స్టు­లో పం­త్‌­కు తీ­వ్ర­గా­య­మైం­ది. క్రి­స్ వో­క్స్ బౌ­లిం­గ్‌­లో రి­వ­ర్స్ స్వీ­ప్ షాట్ ఆడే క్ర­మం­లో పంత్ కు­డి­కా­లి­కి గా­య­మైం­ది.బంతి తగి­లిన చోట వి­ప­రీ­త­మైన వాపు వచ్చిం­ది. అం­తే­కా­కుం­డా గా­య­మైన కుడి పా­దం­పై ని­ల­బ­డ­లే­క­పో­యా­డు. కనీ­సం నడ­వ­లే­క­పో­యా­డు. అయి­తే స్కా­నిం­గ్ చే­య­గా.. బొ­ట­న­వే­లి­కి ఫ్రా­క్చ­ర్ అయి­న­ట్లు తే­లిం­ద­ని సమా­చా­రం. దీం­తో అతడు పూ­ర్తి­గా కో­లు­కు­నేం­దు­కు కనీ­సం 6 వా­రాల సమయం పట్టే అవ­కా­శం ఉం­ద­ని తె­లు­స్తోం­ది. తడు పూ­ర్తి స్థా­యి­లో కో­లు­కు­నేం­దు­కు కనీ­సం 6 వా­రా­లు పట్టే అవ­కా­శం ఉం­ద­ని తె­లు­స్తోం­ది. దీం­తో రి­ష­భ్ పంత్ .. ఈ మ్యా­చు­తో పాటు ఈ సి­రీ­స్ మొ­త్తా­ని­కి దూ­ర­మ­య్యే అవ­కా­శా­లు మెం­డు­గా ఉన్నా­యి. స్కా­నిం­గ్ ని­వే­ది­క­లో ఫ్రా­క్చ­ర్ ఉన్న­ట్లు తే­లిం­ది. అతడు ఆరు వా­రాల పాటు ఆట నుం­చి దూ­రం­గా ఉం­టా­డు. నొ­ప్పి­ని తగ్గిం­చే మం­దు­లు ఇచ్చి అత­డి­ని మళ్లీ బ్యా­టిం­గ్ చే­యిం­చ­డా­ని­కి మె­డి­క­ల్ టీమ్ ప్ర­య­త్ని­స్తోం­ది. అయి­తే, అతడు నడ­వ­డా­ని­కి ఇంకా సహా­యం అవ­స­రం కా­బ­ట్టి, బ్యా­టిం­గ్ చేసే అవ­కా­శా­లు చాలా తక్కు­వ­గా ఉన్నా­యి” అని బీ­సీ­సీఐ తె­లి­పిం­ది. మాం­చె­స్ట­ర్ టె­స్ట్‌­కు పంత్ స్థా­నం­లో ధ్రు­వ్ జు­రె­ల్ వి­కె­ట్ కీ­పిం­గ్ చే­స్తా­డు. అయి­తే, జు­రె­ల్ ప్ర­స్తుత మ్యా­చ్‌­లో బ్యా­టిం­గ్ చే­య­లే­డు. ఇది టీ­మిం­డి­యా­కు ఒక బ్యా­ట­ర్ తక్కు­వ­గా ఉం­డే­లా చే­స్తుం­ది. దాం­తో అతడు నా­లు­గో టె­స్టు­తో పాటు ఐదో టె­స్టు­కు కూడా దూరం కా­ను­న్నా­డు. అం­తే­కా­కుం­డా ఆగ­స్టు నెల మొ­త్తం ఆటకు దూరం కా­ను­న్నా­డు. సె­ప్టెం­బ­ర్‌­లో తి­రి­గి అతడు బరి­లో­కి దిగే అవ­కా­శం ఉంది.

జగదీషన్ కు స్థానం ఖాయమేనా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్ గాయపడటంతో నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్‌ చేయడం అసాధ్యమే. గాయమైన పాదానికి ఆర్థోపెడిక్‌ బూట్‌ వేసుకుని వచ్చిన పంత్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. దీంతో టీమిండియా ఐదవ టెస్ట్‌కు తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి వికెట్ కీపర్‌గా పంత్..

గాయం కాక ముం­దే రి­ష­భ్ పంత్ అరు­దైన రి­కా­ర్డు సా­ధిం­చా­డు. వి­దే­శీ గడ్డ­పై 1000 రన్స్ చే­సిన తొలి వి­కె­ట్ కీ­ప­ర్‌­గా పంత్ ని­లి­చా­డు. రి­ష­భ్ పంత్ ఇం­గ్లాం­డ్ గడ్డ­పై.. 1018 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో నా­లు­గు సెం­చ­రీ­లు, నా­లు­గు హాఫ్ సెం­చ­రీ­లు ఉన్నా­యి. అత్య­ధిక స్కో­రు 146. పంత్ మి­న­హా ప్ర­పం­చం­లో మరే వి­కె­ట్ కీ­ప­ర్ కూడా.. వి­దే­శీ గడ్డ­పై 1000 పరు­గు­లు చే­య­క­పో­వ­డం గమ­నా­ర్హం.

Tags

Next Story