Paris Olympics : ముగిసిన ఒలింపిక్స్.. మన స్థానం ఏంటో తెలుసా?
విశ్వక్రీడల మెగా సమరం పారిస్ ఒలింపిక్స్- 2024 ఆదివారంతో ముగిసింది. అద్భుత విన్యాసాలు, చిరస్మరణీయ ప్రదర్శనలు వాటితో పాటు అంతులేని భావోద్వేగాలు ఇలా ప్రపంచ అథ్లెట్ల మధ్య క్రీడల సమ్మేలనంగా సుమారు 17 రోజుల పాటు సాగిన అతిపెద్ద విశ్వక్రీడల పండగకు నిన్నటితో తెరపడింది. సేన్ నది వేదికగా జులై 26న అట్టహాసంగా ప్రారం భమైన పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 11తో ముగిశాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా అగ్రస్థానం కోసం చైనా, అమెరికా దేశాల మధ్య భీకర పోటీ జరిగింది. అయితే చివర్లో పైచేయ్యి సాధించిన అమెరికా 40 స్వర్ణ పతకాలతో అగ్ర పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సమాన పసిడిలు (40) సాధించిన చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా చైనా కంటే ఎక్కువ మెడల్స్ సాధించిన యూఎస్ఏ.. చివరి క్షణంలో చైనాను దాటేసి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ యూఎస్ఏ 126 పతకాలు సాధించింది. అందులో 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలు ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన చైనా మొత్తంగా 91 మెడల్స్ సొంతం చేసుకుంది. డ్రాగన్ దేశానికి 27 రజతాలు, 24 కాంస్యాలు లభించాయి.
20 గోల్డ్ మెడల్స్ జపాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అసాధారణ ప్రదర్శనతో రాణించిన ఆస్ట్రేలియా (18 స్వర్ణాలు, 19 రజతాలు, 16 కాంస్యాలు) నాలుగో స్థానంలో నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్ 16 గోల్స్, 26 సిల్వర్, 22 బ్రౌన్డ్ మెడల్స్ తో మొత్తం 64 పతకాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ (15 స్వర్ణాలు), గ్రేట్ బ్రిటన్ స్వర్ణాలు), దక్షిణ కొరియా (13 స్వర్ణాలు), ఇటలీ (12 స్వర్గాలు), జర్మనీ (12 స్వర్ణాలు) వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.
భారత అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. 117 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత బృందం ఈసారి 2024 ఒలింపిక్స్ లో 6 పతకాలకే పరిమితమైంది. భారత్ పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన ఆరు పతకాల్లో ఒక "రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు సాధించగా ఈసారి ఆ సంఖ్యను ఒకటి తగ్గింది. టోక్యోలో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4. కాంస్యాలు గెలిచింది. ఈసారి పారిస్ లో ఒక్క గోల్డ్ కూడా రాలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com