Pakistan Jersey : మరోసారి వక్రబుద్ధిని చాటుకున్న పాక్... ఛీ ఛీ ఇంత నీచమా?
Pakistan Jersey : రెండో దశ ఐపీఎల్ చివరిదశకి చేరుకుంది. ఆ తర్వాత అభిమానులను అలరించేందుకు టీ20 ప్రపంచ కప్ సిద్దమవుతోంది.. అక్టోబర్ 17 నుంచి ఈ మెగా టోర్నమెంట్ రెడీ అవుతోంది. UAE వేదికగా భారత్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే పలు జట్లు అక్కడికి చేరుకున్నాయి.
ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనే పలు దేశాలు ప్రత్యేక జెర్సీలు రూపొందించుకుంటున్నాయి. అయితే ఇక్కడే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జట్లన్నీ ICC టీ20 ప్రపంచ కప్ ఇండియా 2021అనే లోగోతో జెర్సీలను ధరించాల్సి ఉంది. కానీ పాక్ తన జెర్సీని ICC టీ20 ప్రపంచ కప్ UAE 2021అని రాసుకుంది.
ఇప్పుడిది వివాదాస్పదం అయింది. దీనిపైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించాల్సి ఉంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకొని పాకిస్థాన్ జెర్సీలపై ఇండియా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
కాగా టీ20 ప్రపంచకప్ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com