భారత జట్టుకి ప్రధాని మోదీ ప్రశంసలు!

భారత జట్టుకి ప్రధాని మోదీ ప్రశంసలు!
ఆస్ట్రేలియా జట్టు పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

ఆస్ట్రేలియా జట్టు పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్ళు, తమ అభిరుచి, అధ్భుత శక్తిని ప్రదర్శించారని, భారత విజయాన్ని మేము కూడా ఎంజాయ్ చేశామని అన్నారు. భారత జట్టుకు అభినందనలు.. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్టుగా మోడీ ట్వీట్ చేశారు.

నాలుగో టెస్టులో పెద్దగా సీనియర్ల లేకున్నా జూనియర్లు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గిల్ (91), పూజారా (56), పంత్ (89 నాటౌట్ ), సుందర్ (22) వీరోచిత పోరాటంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్ డ్రా అవ్వడమే గొప్ప అనుకుంటే భారత్ ను గెలిపించి హీరోస్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story