Praggnanandhaa : సెమీస్‌లోప్రజ్ఞానంద ఓటమి

Praggnanandhaa : సెమీస్‌లోప్రజ్ఞానంద ఓటమి
X

లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ చెస్‌ మాస్టర్స్ 2024లో ప్రజ్ఞానంద సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. అర్జున్ ఇరిగైసి తొలి గేమ్‌ను గెలిచి ఆధిక్యం సాధించాడు. అయితే, రెండో గేమ్‌ డ్రాగా ముగించారు. దీంతో 1.5 - 0.5 తేడాతో అర్జున్‌ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తుది పోరులో మాక్సిమ్ వాచీర్‌తో అర్జున్ తలపడనున్నాడు. కాగా సెమీస్‌కు వచ్చే క్రమంలో ప్రజ్ఞానంద తన గురువు విశ్వనాథన్‌ ఆనంద్‌పై గత మంగళవారం జరిగిన పోరులో విజయం సాధించాడు. రెండు క్లాసికల్ గేమ్స్‌లో ఆనంద్, ప్రజ్ఞానంద తలపడ్డారు. రెండు గేమ్‌లూ డ్రాగా ముగిశాయి. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద తెల్ల పావులతో బరిలోకి దిగాడు. ఆనంద్ నల్లపావులతో ఆడి డ్రాగా ముగించాడు. ఇక రెండో గేమ్‌లో ఆనంద్‌ డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా ప్రజ్ఞానంద దూకుడుగా ఆడాడు. కానీ, అది కూడా డ్రా దిశగా సాగింది. విజేతను తేల్చే కీలకమైన (ఆర్మగెడ్డన్‌) పోరులో ఆనంద్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు.

Tags

Next Story