Indian Team : భారత జట్టుపై ప్రశంసల వర్షం

ఆసియాకప్ ఫైనల్ టైటిల్ సాధించిన భారత జట్టుపై సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ప్రశంసలు కురిపించారు. టోర్నమెంట్ లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని గుర్తుచేసిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము...ఇది ఆటలో మన ఆధిపత్యాన్ని సూచిస్తుందని తెలిపారు. యుద్ధ భూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమని, రెండు చోట్లా ఇండియానే గెలిచిందని పోస్టు చేసిన ప్రధాని.. మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్ కనిపించిందని రాసుకొచ్చారు. భారత క్రికెటర్లకు అభినందనలని పేర్కొన్నారు. ఇది ఒక అద్భుతమైన విజయమని, మన ఆటగాళ్ల శక్తి...ప్రత్యర్థులను కుప్పకూల్చిందని పోస్టు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...ఏ రంగంలోనైనా భారత్ గెలవాల్సిందేనని అందులో వివరించారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన I.C.C ఛైర్మన్ జైషా...టీమిండియా తన ప్రతిభ, స్థిరత్వం, వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రదర్శించిందని వెల్లడించారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com