Punjab Kings Coach : కోచ్‌కు పంజాబ్ గుడ్‌బై?
కోచ్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ బాటలోనే పంజాబ్ కింగ్స్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవోర్ బేలిస్ ( Trevor Bayliss ) కాంట్రాక్ట్ గత IPL సీజన్‌తో ముగిసింది. దీంతో ఆయన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించొద్దని పంజాబ్ నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే సీజన్‌కు బేలిస్ స్థానంలో స్వదేశీ కోచ్‌ను నియమించాలని చూస్తోందట. కాగా ఇటీవల రికీ పాంటింగ్‌ను ఢిల్లీ కోచ్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ట్రెవర్ బేలిస్ స్థానంలో సురేష్ రైనాను రీప్లేస్ చేయాలని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫిక్స్ అయిందని వినిపిస్తోంది. ఒక్కసారి కూడా కప్పు అందుకోని పంజాబ్‌ను ఎలాగైనా విజేతను చేయాలని ఓనర్స్ భావిస్తున్నారట. అందుకోసం మంచి కోచ్‌తో పాటు మెగా ఆక్షన్‌లో టాప్ ప్లేయర్లను తీసుకోవడం, అలాగే సరైనోడ్ని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే బేలిస్ స్థానంలో రైనాకు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నారట. టీమ్‌పై అథారిటీ, ఫ్రీడమ్ ఇస్తుండటంతో రైనా కూడా వాళ్ల ఆఫర్‌కు ఓకే చెప్పాడని.. అధికారిక ప్రకటనే తరువాయి అని సమాచారం.
రైనాతో పాటు దిగ్గజాలు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా కోచింగ్ కోసం పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే యువీ గుజరాత్ టీమ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం, వీరూ కంటే రైనా బెటర్ ఆప్షన్ అనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. రైనా వస్తే పంజాబ్ రాత మారుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com