Pv sindhu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

X
By - Gunnesh UV |13 Aug 2021 12:35 PM IST
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివిసింధు దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరిన సింధు.. రాత్రి అక్కడే బసచేశారు.
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివిసింధు దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరిన సింధు.. రాత్రి అక్కడే బసచేశారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో ఆమెతో పాటు చాముండేశ్వర్ నాధ్ స్వామివారిని దర్శించుకున్నారు. సింధును ఆశీర్వదించి, తీర్ధ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు సింధు. త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తున్నాని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు అకాడమీ ఓపెన్ చేస్తున్నట్లు సింధు పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com