Ravichandran Ashwin : కపిల్ దేవ్, ధోనీ సరసన అశ్విన్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత శతకం సాధించిన రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత అందుకున్నాడు.అంతేకాదు, తీవ్ర కష్టాల్లో పడిన భారత జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చిన అశ్విన్ క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ సరసన చేరాడు. స్వదేశంలో ఏడో స్థానం అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. అశ్విన్ ప్రస్తుతం నాలుగు శతకాలు సాధించాడు. కపిల్, ధోనీ కూడా నాలుగేసి సెంచరీలు నమోదు చేశారు. ఇక అశ్విన్‌కు చెపాక్ వేదికగా రెండో శతకం కావడం విశేషం. కాగా, భారత్ 144/6 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును జడేజా(86)తో కలిసి అశ్విన్ మళ్లీ రేసులో నిలబెట్టాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి కేవలం 227 బంతుల్లోనే 195 పరుగులు జోడించారు. బంగ్లాపై 8వ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ ప్రస్తుత ఇన్నింగ్స్‌తో కలిపి 2 శతకాలు సహా 361 పరుగులు సాధించాడు. 23 వికెట్లు కూడా పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com