Jadeja : మరో ఆరు వికెట్లు తీస్తే 300.. టెస్టుల్లో అరుదైన ఫీట్ కు చేరువలో జడేజా

టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ).. టెస్ట్ ఫార్మాట్‌లో రెండు రికార్డులపై కన్నేశాడు. ఈ స్పిన్నర్ మరో ఆరు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 300 వికెట్ల ఫీట్ ను అందుకుంటాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ క్లబ్‌లో అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (516), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు. ఆరు వికెట్లు సాధిస్తే జడేజా మరో రికార్డునూ అందుకోనున్నాడు. టెస్టుల్లో 3 వేల కంటే ఎక్కువ రన్స్ చేయడంతో పాటు 300 వికెట్లు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు. కపిల్ దేవ్ (5,248 రన్స్), అశ్విన్ (3,309 రన్స్) ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన రవీంద్ర జడేజా ఇప్పటివరకు 72 టెస్టులు ఆడి బ్యాటర్‌గా 3,036 రన్స్, బౌలర్‌గా 294 వికెట్లు సాధించాడు. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో జడేజాకు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com