RCB : ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసిన ఆర్సీబీ

నిన్నటి మ్యాచులో గుజరాత్ చేతిలో పరాజయంతో ఆర్సీబీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఒకే వేదికపై అత్యధిక మ్యాచులు ఓడిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ చెత్త రికార్డును సమం చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 92 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 44 మ్యాచుల్లో ఓడింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీలో 82 మ్యాచులు ఆడి 44 మ్యాచుల్లో ఓడటం గమనార్హం.
బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఓడిపోవడంతో ఆర్సీబీపై నెటిజన్లు SM వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం గాలివాటమేనని కామెంట్లు చేస్తున్నారు. మూడో మ్యాచులో పరాజయంతో ‘వింటేజ్ ఆర్సీబీ’ తిరిగి వచ్చేసిందని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పరాజయంతో తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సారి కప్పు కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com