IPL 2025 : RCB సూపర్ విక్టరీ.. మలుపు తిప్పిన రివ్యూ

రాజస్థాన్‌పై ఆర్సీబీ సూపర్ విక్టరీకి ఓ రివ్యూ బాటలు వేసింది. రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం ఉండగా హేజిల్‌వుడ్ బౌలింగ్ వేశారు. మూడో బంతిని జురెల్ మిస్సయ్యాడని అందరూ అనుకున్నారు. అంపైర్ కూడా ఆసక్తి చూపలేదు. కీపర్ జితేశ్ మాత్రం రివ్యూ కావాలన్నారు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్టు తేలడంతో జోరుమీదున్న జురెల్(47- 3 సిక్సులు, 3 ఫోర్లు) ఔటయ్యారు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్‌లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్‌లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్‌రన్ రేటు ఉండాలి. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ , ముంబై ,పంజాబ్ అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాజస్థాన్ ప్లేఆఫ్స్ వెళ్లలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com