Vinesh Phogat : ఫోగట్‌కు ప్యారిస్ కోర్టులో ఊరట.. సిల్వర్ మెడల్ దక్కేచాన్స్

100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్ పోటీకి అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్ కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్ ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభి ప్రాయపడింది. తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పారిస్ స్పోర్ట్స్ కోర్టులో వినేశ్ సవాల్ చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వినేశ్ తరుపున నలుగురు న్యాయవాదులు.వాదనలు వినిపించారు.
వినేశ్ ఫోగాట్ కు సిల్వర్ పతకం ఇవ్వాలని ప్రముఖ అమెరికన్ ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ బరోస్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆమె సిల్వర్ మెడల్ కు అర్హురాలని అన్నారు. జోర్డాన్ ఐరోస్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలిచారు. 2012లో లండన్ ఒలింపిక్స్ లోనూ స్వర్ణం సాధించాడు. అంతేకాకుండా.. వినేశ్ ఫోగట్ కు చాలా మంది అండగా నిలుస్తున్నారు.
మరోవైపు.. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమెపై అనర్హత వేటు వేసినందుకు.. ఆమె రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా.. ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ ఫైనల్స్ కు చేరిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. మరోవైపు.. రెజ్లర్ వినేష్ ఫోగట్ కి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు 4 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది హర్యానా ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com