Ricky Ponting : భారత్‌పై 3-1 తేడాతో గెలుస్తాం: పాంటింగ్

ఆస్ట్రేలియా-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబరు నుంచి మొదలుకానుంది. అందులో తమదే విజయమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంటామని జోస్యం చెప్పారు. ‘సొంతగడ్డపై గత రెండు సిరీస్‌లు ఓడిపోయాం. మా ఆటగాళ్లు కసిగా ఆడతారు. కచ్చితంగా మేమే గెలుస్తామని నా నమ్మకం’ అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటూ వస్తోంది భారత జట్టు. ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడం వేరు, కానీ 2018-19, 2019-20 ఆస్ట్రేలియా పర్యటనల్లో కూడా ఆతిథ్య జట్టును చిత్తు చేసి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది భారత జట్టు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, నవ్‌దీప్ సైనీ... గాయపడినా కుర్రాళ్లతో నిండిన టీమ్ అద్భుతం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com