ROHIT: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి టీమ్‌ఇం డియా స్టా ర్ ఆటగాడు రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టా రు. ఆ స్టాండ్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ తల్లి దండ్రు లు, సతీమణి రితిక హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లా డుతూ భవిష్యత్‌లో వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ఇం డియా తరఫున వాంఖడే స్టేడియంలో ఆడాలనుందని పేర్కొన్నాడు. స్టాండ్‌కు తన పేరు పెడతారని తానెప్పుడూ ఊహించలేదని రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నప్పుడు ముంబై తరఫున, టీమ్‌ఇండియా తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు... ఎప్పుడూ వీటి గురించి ఆలోచించలేదన్నాడు.
వాంఖడేలో ఎన్నో జ్ఞాపకాలు
ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుందని హిట్ మ్యాన్ అన్నాడు. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తా మని.. వాటన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం... వాంఖడే గొప్ప స్టేడియమని రోహిత్ అన్నారు. దీనితో తనకు ఎన్నో గొప్ప జ్ఞా పకాలు ఉన్నాయిన్న హిట్‌మ్యా న్.. గొప్ప ఆటగాళ్లు , రాజకీయ నేతల మధ్యలో నా పేరు ఉండటాన్ని తాను మాటల్లో చెప్పలేనని వెల్లడించాడు. "21వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడటం, ముంబై ఇండియన్స్ తరపున ఆడటం, నా పేరు మీద ఉన్న స్టాండ్‌లో ఆడటం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. టీమ్ ఇండియా తరపున ఆడుతున్నప్పుడు కూడా ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది." నా కుటుంబం, ముఖ్యంగా నా తల్లి దండ్రులు, అన్న, వదిన, భార్య ముందు ఈ గౌరవం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్లు నా కోసం చేసిన త్యాగాలకు నేను కృతజ్ఞు డిని. ముంబై ఇండియన్స్ టీమ్‌కి కూడా ధన్యవాదాలు" అని ఆయన అన్నారు. రోహిత్ 499 అంతర్జా తీయ మ్యాచ్‌ల లో 19,700 పరుగులు చేశారు. 49 శతకాలు, 108 అర్ధశతకాలు, 264 అత్యధిక స్కోరు సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com