Cricket : రోహిత్ రికార్డు.. చరిత్ర లిఖించిన షమీ

Cricket : రోహిత్ రికార్డు.. చరిత్ర లిఖించిన షమీ
X

గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్ ను చేరుకోవడానికి రోహిత్ కు 261 ఇన్నింగ్స్ లు ఆడాడు. శర్మ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (276 ఇన్నింగ్స్లు) రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, ఈ జాబితాలో మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 222 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలురాయిని పూర్తి చేసుకుని అగ్ర స్థానంలో నిలిచాడు. తర్వాత రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్ లు) 4వ, సౌరవ్ గంగూలీ (288 ఇన్నింగ్స్లు) 5వ స్థానంలో ఉన్నారు.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మూడో వికెట్ తీసిన షమీ వన్డే క్రికెట్లో 200 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ ఫీటు సాధించడానికి షమీకి 5,126 బంతులు అవసర మయ్యాయి. ఇక ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (5,240 బంతుల్లో 200 వికెట్లు )పేరిట ఉండేది. తాజాగా షమీ స్టార్క్ ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, మ్యాచుల పరంగా మాత్రం స్టార్క్ (102 వన్డేలు) టాప్ ప్లేస్ లో ఉండగా.. షమీ (104 వన్డేలు) రెండో స్థానంలో నిలిచాడు.

Tags

Next Story