Sachin Redord Breaks : సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. వరుస రెండో హాఫ్ సెంచరీ కొట్టడంతో పాటు భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా సచిన్(120) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ(121) బ్రేక్ చేశారు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనతను అందుకున్నారు. అలాగే వన్డేల్లో తొలి పది ఓవర్లలోపు అత్యధిక ఫిఫ్టీలు కొట్టిన భారత బ్యాటర్ల లిస్టులో హిట్‌మ్యాన్(4) రెండో స్థానంలో ఉన్నారు. సెహ్వాగ్(7) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకపై భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పోరాడుతున్నా మిగతా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. తొలి వన్డేలో 75/0తో పటిష్ఠ స్థితిలో నిలిచిన టీమ్ ఇండియా 230కి ఆలౌటైంది. రెండో వన్డేలో 97/0 నుంచి 208కే చాప చుట్టేసింది. రోహిత్ ఔట్ అవ్వగానే పిచ్ మారిపోతుందా? అని నెటిజన్లు భారత బ్యాటర్లపై మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com