MS Dhoni : ధోని ముందే బ్యాటింగ్ కు వస్తే బాగుండేది .. రోహిత్ శర్మ కామెంట్స్
వన్డే వరల్డ్ కప్–2019లో టీమిండియాలో సెమీ ఫైనల్ లో ఓడిపోయింది. ధోనీ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో ధోనీ లోయర్ ఆర్డర్‌లో ఆడాడు. కీలకమైన నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు, విజయ్ శంకర్ మధ్య పోటీ ఎదురైన సంగతి తెలిసిందే. విజయ్‌ను ఎంపిక చేయడంతో నాటి సెలక్షన్ కమిటీపై రాయుడు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలూ చేశారు. ఇదంతా జరగకుండా ధోనీ ముందే బ్యాటింగ్ కు వచ్చి ఉంటే బాగుండేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.కెప్టెన్‌తోపాటు కోచ్ నిర్ణయమే కీలకమని.. వ్యక్తిగతంగా మాత్రం ధోనీ నాలుగో ప్లేస్‌లో రావాలని భావించినట్లు రోహిత్ వెల్లడించాడు. ‘ధోనీ స్థానం అత్యంత కీలకమని తెలుసు. టీమ్ ప్రయోజనం కోసం అతడు నాలుగో స్థానంలో వచ్చి ఉంటే బాగుండేది. అప్పటి కెప్టెన్ విరాట్, కోచ్ ఆలోచనలను తప్పుబట్టడం లేదు. ఒకవేళ ధోనీ ముందే బ్యాటింగ్‌కు వచ్చుంటే నేను సంతోషపడేవాడిని’అని రోహిత్ తెలిపాడు. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 239 రన్స్ చేసింది. చేజింగ్ కు దిగిన టీమిండియా 221కే ఆలౌటై ఓడిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com