Ravichandran Ashwin : ఆ విషయంలో రోహిత్ శర్మనే బెటర్ : అశ్విన్

Ravichandran Ashwin : ఆ విషయంలో రోహిత్ శర్మనే బెటర్ : అశ్విన్

టీమిండియా మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లీ కంటే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలను రూపొందించడంలో ఎక్కువగా పనిచేస్తాడని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ముగ్గురి కెప్టెన్సీ గురించి అశ్విన్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ, కోహ్లీ కంటే రోహిత్‌ టీమ్ ను రిలీఫ్​ గా ఉంచుతాడని అశ్విన్ తెలిపాడు. వ్యూహాల విషయంలోనూ వారిద్దరి కంటే రోహిత్‌ ఎక్కువగా పనిచేస్తాడన్నాడు. ‘రోహిత్ కెప్టెన్సీలో రెండు మూడు విషయాలు చాలా బాగున్నాయి. అతను టీమ్ వాతావరణాన్ని తేలికగా ఉంచుతాడు. ఫైనల్ టీమ్ సెలక్ట్ విషయంలో బ్యాలెన్స్ పాటిస్తూ వ్యూహాత్మకంగా బలంగా ఉంటాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ రాబోతున్నట్లయితే ఎనలిటిక్స్ టీమ్, కోచ్‌తో కూర్చుని బ్యాటర్ల బలాలు, బలహీనతలు.. బౌలింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తాడు. అదే రోహిత్‌ బలం.ప్లేయర్లకు రోహిత్ సపోర్టు ఎక్కువ ఉంటుంది. తుదిజట్టులోకి ఒక ప్లేయర్ ను ఎంపిక చేస్తే అతడికి రోహిత్ వంద శాతం సపోర్టు ఇస్తాడు. నా కెరీర్‌లో ఎక్కువ భాగం ఈ ముగ్గురు కెప్టెన్లతో ఆడాను’అని అశ్విన్‌ వివరించాడు.

Tags

Next Story