Rohit Sharma : అస్సలు ఊహించలేదు : ఓటిమిపై కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma : అస్సలు ఊహించలేదు : ఓటిమిపై కెప్టెన్ రోహిత్ శర్మ
X

న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఘోర పరాభవంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించారు. ఈ ఓటమి తాము అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశాడు. కివీస్‌ జట్టు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని అందుకే పరాజయం పాలయ్యామని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ తమ కంటే మెరుగ్గా ఆడిందని.. వాళ్లు విజయానికి అర్హులేనన్నాడు. మాకు గెలిచే అవకాశం వచ్చినా.. దానిని ఒడిసిపట్టలేకపోయాం. సవాళ్లకు ఎదురీదలేకపోయామని చెప్పుకొచ్చాడు. తమ బ్యాటింగ్‌ బాగాలేదని అనుకోవడం లేదని.. నిజానికి 20 వికెట్లు తీస్తే గెలిచే అవకాశం ఎక్కువగానే ఉంటుందని.. అయితే, బ్యాటింగ్‌ సమయంలోనూ మేము పట్టుదలగా పోరాడామన్నాడు.

Tags

Next Story