Rohit Sharma : మరోసారి తండ్రి కాబోతున్న రోహిత్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రోహిత్ శర్మ భార్య రితికకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో రితిక మళ్లీ ప్రగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో బేబీ బంప్ తో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి రోహిత్ శర్మ నుంచి క్లారిటీ రావాల్సిందే. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ , నెటిజెన్స్ .. త్వరలోనే జూనియర్ హిట్ మ్యాన్ మన ముందుకు రాబోతున్నడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వలన మొదటి రెండు టెస్టులకు ఉండనని ఇప్పటికే బీసీసీఐ కి సమాచారం ఇచ్చారు. ఇక అందరూ భార్య కోసమే అని అందుబాటులో ఉండటల్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీ20 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com