CT2025: చరిత్ర సృష్టించిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. లీగ్ స్టేజీ, సెమీఫైనల్, ఫైనల్ ఇలా ప్రతి రౌండ్లో ఒక్క పరాజయం లేకుండా కప్పు కొట్టింది. అటు ఈ టోర్నీలో టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడింది. అయితే, ICC ఈవెంట్‌లో ఒక్క టాస్ కూడా గెలవకుండా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కాగా, ఇది భారత్‌కు మూడో ఛాంపియన్స్ ట్రోఫీ.
భారత్‌కు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించింది. విజేతకు రూ.19.45 కోట్లు దక్కగా.. ఫైనల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ రూ.9.72 కోట్లు చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రూ.4.86 కోట్లు చొప్పున సొంతం చేసుకున్నాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది. కాగా, భారత్ మూడోసారి CT టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్ ఎంతమంది చూశారంటే?
CT-2025 ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ ప్రియులు కోట్ల మంది వీక్షించారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను 68 కోట్ల మంది చూడగా.. ఈ ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం జియో హాట్ స్టార్‌లో దాదాపు 89.7 కోట్ల మంది తిలకించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ICC ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. అంతకుముందు 2002, 2013లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
డ్యాన్స్‌తో అలరించిన గావస్కర్
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ మూడోసారి అవతరించింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ విజయంతో లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్టేడియంలో ఆనందంతో స్టెప్పులు వేశాడు. ఓ వైపు జట్టు సభ్యులు కప్పు అందుకుంటుండగా.. మరోవైపు గావస్కర్ వ్యాఖ్యాతలతో మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రోహిత్, కోహ్లీ సెలబ్రేషన్
ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇద్దరు చెరో వికెట్ తీసుకుని దాండియా ఆడారు. ఒకరినొకరు హత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com