Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
X

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లారు.

ఐపీఎల లో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా చెన్నైతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.

Tags

Next Story